సుశాంత్ కేసు : అతను రాకపోతే అసలు రహస్యం చెబుతా..?

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ కేసులో రోజుకొక కొత్త కోణం తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. మొదట ఆత్మహత్య అని అందరూ అనుకున్నారు ఆ తర్వాత అనుమానాస్పద మృతి అని ఎవరో చంపారు అంటూ ఎన్నో ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. ఇటీవలే డ్రగ్స్ వ్యవహారం కూడా తెర మీదికి వచ్చి సంచలనం సృష్టించింది. ఇప్పుడు సుశాంత్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ సహా అతని మాజీ మేనేజర్ దిశా ఆత్మహత్యపై బిజెపి ఎమ్మెల్యే నితీష్ రాణే పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య, అంతకుముందు జరిగిన సుశాంత్ మాజీ మేనేజర్ దిశ ఆత్మహత్య కు లింకు ఉంది అంటూ ఆరోపించిన బిజెపి ఎమ్మెల్యే… దిశ ప్రియుడు రోహన్ ను విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి అంటూ తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాసిన ఆయన.. ఒకవేళ దిశ ప్రియుడు రోహన్ బయటకు రాకపోతే తానే కొన్ని రహస్యాలను సీబీఐకి చెప్తాను అంటూ వివరించారు.