ఇండియాలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు !

-

భారత్ లో కరోనా విజృంభిస్తూనే ఉంది. అయితే కొద్ది రోజులుగా కాస్త తక్కువగా నమోదవుతున్న కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటలలో 85,362 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 1,089 మంది మృతి చెందారు. అలానే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 81,177గా ఉంది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59,03,933 కు చేరగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా 9,60,969 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 48,49,585కు చేరింది. అలానే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 93,379కు చేరింది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 81.98% శాతానికి చేరింది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 16.36 శాతంగా ఉన్నాయి. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.58 శాతానికి తగ్గింది. ఇక ఈరోజు ఇండియాలో రికార్డు స్థాయిలో కరోన పరీక్షలు చేశారు. నిన్న ఒక్క రోజే 13,41,535 “కరోనా” వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. దీంతో ఇప్పటిదాకా 7,02,69,975 పరీక్షలు చేసినట్టు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news