ప్రస్తుతం ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు.. అతికొద్ది కాలంలో కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబుగా మిగిలిపోబోతున్నారనే కామెంట్లు రోజురోజుకీ రాజకీయవర్గాల్లో పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో… చంద్రబాబు లక్ష్యం మారిపోతుందని అంటున్నారు విశ్లేషకులు.
అవును… నిన్నమొన్నటివరకూ బాబు లక్ష్యం.. జగన్ ని ఓడించడం మాత్రమే! 2019 ఎన్నికల ముందువరకూ కూడా బాబుకున్న ధైర్యం… జగన్ కు అంతసీన్ లేదని. కాని బాబొకటి తలస్తే.. జనం మరొకటి చూపించారు.. ఆ చూపించడం కూడా అలా ఇలా కాదు.. చంద్రబాబుకు పట్టపగలు మిట్టమధ్యాహ్నం ఆకాశంలో చుక్కలు చూపించారు! దీంతో ఇక జగన్ ను తాను ఒంటరిగా ఎదుక్రోవడం కలేనని ఫిక్సయిపోయారంట! అందులో భాగంగానే నమో జపం చేస్తున్నారంట చంద్రబాబు!
ఏమాత్రం అవకాశం ఉన్నా.. బీజేపీ నేతలు అడిగినా అడగకపోయినా.. ప్రభుత్వానికి కేంద్రంలో మద్దతులు ప్రకటించేయమని చెబుతున్నారంట. కేంద్రప్రభుత్వం సభలో ఏ బిల్లు పెట్టినా వెనకా ముందూ చూడకుండా చేతులు ఎత్తేయాలని తమ ఎంపీలకు సూచిస్తున్నారంట. ఈ విషయంలో జగన్ ఏమైనా తక్కువ తిన్నాడా? ఉత్తిచేతులతో చేతులెత్తే బాబుకే అంతే ఆలోచన ఉంటే… 23 మంది ఎంపీలున్న జగన్ అంతకు మించి అన్నట్లుగా దూసుకుపోతున్నారు.
తాజాగా వివాదాస్పద వ్యవసాయ బిల్లుకు శిరోమణీ అకాలీదళ్ కూడా నో చెప్పడంతోపాటు కేంద్ర మంత్రి పదవినే వదులుకున్నా కానీ జగన్ మాత్రం జై అన్నారు! దీంతో మోడీ – జగన్ బంధం మరింత బలపడిపోయింది. దీంతో బాబు ముఖం ఎర్రగా మారిపోయిందంట! ఏది ఏమైనా సరే రాబోయే 2024 ఎన్నికల్లో మొడీతో కలిసి ఏపీలో ఎన్నికలకు వెళ్లలేని పక్షంలో ఫలితాల అనంతరం బాబు చాప్టర్ క్లోజ్ అనేది సన్నిహితులు కూడా చెబుతున్నారంట.
దీంతో బెంగట్టుకున్న బాబు… ఆరునూరైనా నూరు ఆరైనా సరే.. జగన్ – మోడీ మధ్య ఏదోలా, అడ్డదిడ్డంగా ఆలోచించి అయినా పుల్లలు పెట్టి.. ఎన్నికల నాటికి తాను మోడీ సరసన చేరాలని తపిస్తున్నారంట. అలాకానిపక్షంలో బాబు కాస్త మాజీ ఎమ్మెలేగా.. టీడీపీ కాస్త కమ్యునిస్టు, జనసేన, కాంగ్రెస్ ల సరసన చేరిపోయే ప్రమాధం సుస్పష్టం అని బాబుకూడా నమ్ముతున్నారంట!! సో.. జగన్ ని తిట్టడం తర్వాత.. ముందు మోడీని పొగడాలని బాబు ఫిక్సయ్యారంట!!
-CH Raja