మరి కాసేపట్లో హేమంత్ అంత్యక్రియలు.. భారీ బందోబస్తుతో !

-

నిన్న పరువు హత్యకు గురయిన హేమంత్ అంత్యక్రియలు ఈరోజు జరగనున్నాయి. ఇప్పటికే కాంటినెంటల్ హాస్పిటల్ నుండి హేమంత్ డెడ్ బాడీ ఇంటికి చేరుకుంది. అతని అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. యూకే నుండి అతని సోదరుడు వచ్చిన తర్వాతే అంత్యక్రియలు మొదలు కానున్నాయి. విషయం తెలియగానే ఆయన బయలుదేరడంతో మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకోనున్నాడు. ఇక హేమంత్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరి కాసేపట్లో హేమంత్ అంత్యక్రియలు.. భారీ బందోబస్తుతో !

హేమంత్ ను చివరి చూపు చూసుకునేందుకు బంధువులు, స్నేహితులు ఇంటికి చేరుకుంటున్నారు. మధ్యాహ్నం లోగా అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే దహన సంస్కారాలు త్వరగా పూర్తి చెయ్యాలని పోలీసులు కోరుతున్నట్టు తెలుస్తోంది. నిన్న ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కాంటినెంటల్ ఆసుపత్రికి హేమంత్ మృతదేహం తరలించారు. దానిని కొద్ది సేపటి క్రితమే చందానగర్ లో ఉన్న వారి సగృహానికి తీసుకు వెళ్లారు. హేమంత్ సోదరుడు రాగానే అంత్యక్రియలు మొదలు పెట్టే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news