మరో వివాదంలో సంచయిత.. విమర్శల వర్షం !

-

లాక్ డౌన్ కి కొద్ది రోజుల ముందు మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న సంచైత గజపతిరాజు తీరు అన్ని విషయాల్లో వివాదాస్పదం అవుతోంది. నిజానికి ఆనందగజపతిరాజు మొదటి భార్య ఉమా గజపతి కుమార్తె అయిన సంచయితకు అసలు ఆస్తిలో హక్కు లేదనేది కుటుంబ సభ్యుల వాదన. ఇప్పటికే ఆమె నియామకం అన్యాయం అని సంచయిత మీద బాబాయ్ అశోక్ గజపతిరాజు కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్న తరుణంలోనే తాజాగా ఆమె తీసుకున్న మరో నిర్ణయం వివాదాస్పదం అయింది.

మాన్సాస్ కు సంబందించిన చిన్నా చితకా నిర్ణయాలే ఇప్పటి దాకా వివాదాస్పదం అయితే ఇఫ్పుడు ఏకంగా మహారాజా కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకోవడం పెద్ద ఎత్తున విమర్శలకి తావిస్తోంది. ప్రస్తుతం ఎయిడెడ్ కళాశాలగా ఉన్న ఎంఆర్ కళాశాలను ప్రైవేటీకరించాలని ప్రభుత్వానికి మాన్సాస్ సంస్థ అభ్యర్థన పంపింది. వెంటనే అభ్యర్థనను పరిశీలించాలంటూ ఆర్జీడీని ఉన్నత విద్యా మండలి ప్రత్యేక కమిషనర్ ఆదేశించారు కూడా. 1879లో స్థాపించిన ఎంఆర్ కళాశాల రాష్ట్రంలోనే అతి పెద్ద, ప్రాచీన కళాశాలగా ప్రసిద్ధి చెందింది. మాన్సాస్ ప్రతిపాదనపై అధ్యాపకులు, సిబ్బందిలో ఆందోళన మొదలయింది. ఎందరో మహా మహులను అందించిన సంస్ధకు మకిలి అంటిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news