తెలంగాణ సర్కార్ మరో కీలక ప్రకటన చేసింది. ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది రేవంత్ రెడ్డి సర్కార్. మార్చి 1న లక్ష కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనుందట తెలంగాణ సర్కార్. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది రేవంత్ రెడ్డి సర్కార్.

మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారట. పదేండ్ల తర్వాత పేదల కల నెరవేరుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. అయితే…. ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడంపై…తెలంగాణ రాష్ట్ర ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.