బిగ్ బాస్ హౌస్ లో గడిచిన రెండు రోజుల నుంచి కిల్లర్ టాస్క్ తో హౌజ్మేట్స్ని, ప్రేక్షకులను టెన్షన్ పెట్టిన బిగ్ బాస్… నేడు మాత్రం ప్రేక్షకులను కనువిందు చేసేందుకు ఫ్యాషన్ షో టాస్క్ ను ఇవ్వ బోతున్నారు. ఇక నేటి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసుకుని విడుదల చేసింది. ఈ వీడియోలో ఫ్యాషన్ షో కు సంబంధించిన కొన్ని విజువల్స్ కనువిందు చేశాయి. అలాగే ఫ్యాషన్ షో లో భాగంగా అమ్మాయిలు అదిరిపోయే డ్రెస్సులతో రాంప్ వాక్ చేస్తూ కనువిందు చేశారు.
ఇక మరోవైపు అదిరిపోయే పంచ్ లతో అవినాష్ కూడా అరిపించాడు. ఇక అవినాష్ చేసిన సందడి ప్రోమో చూస్తే ఇట్టే అర్థమవుతుంది. హౌస్ లో ఉండే ఆడవాళ్లు అందరూ కూడా అవినాష్ అద్దంగా మారగా, వారందరూ అభిలాష్ ఎదురుగా కూర్చుని ఆయనలో తమను చూసుకుంటూ ప్రేక్షకులను అలరించారు. ఈ నేపథ్యంలో అవినాష్ పై గంగవ్వ అదిరిపోయే పంచ్ వేసింది. ఈ అద్దంలో నా ముక్కు ఏంది… ఇంత పెద్దగా పడుతుంది అని అనేసరికి సభ్యులు అందరూ కూడా నవ్వడం మొదలు పెట్టారు. ఇక తాజాగా స్టార్ మా విడుదల చేసిన ప్రోమో ను అనుసరించి ఈ రోజు ఎపిసోడ్ ఫుల్ ఫన్నీగా, జోష్ గా ఉంటుందని అర్ధమవుతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ ప్రోమోను ఒకసారి చూసేయండి…
Adarakotte fashion show ayyaka…#Avinash addamlo book aipoyaru 😂 #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/gGGvolKgZr
— starmaa (@StarMaa) October 2, 2020