పోలీస్ కస్టడీలో మృతి చెందిన అజయ్ మృతిపై నిజనిర్ధారణ కమిటీ వేసారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవాలు తెలుసుకుని నివేదిక అందించాలని చంద్రబాబు సూచనలు చేసారు. అధికార పార్టీ నాయకులు రాష్ట్రంలో మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దళిత వర్గానికి చెందిన అజయ్ ను పోలీసులు వేధించడం దుర్మార్గంఅని ఆవేదన వ్యక్తం చేసారు.
అక్రమ మద్యం రాష్ట్రంలో విచ్చలవిడిగా సరఫరా అవుతుందని అన్నారు. ప్రభుత్వ అవినీతి దాహానికి 40మంది శానిటైజర్ తాగి మృతి చెందలేదా అని నిలదీశారు. నిజ నిర్ధారణ కమిటీలో సభ్యులుగా మాజీ మంత్రి జవహర్, మాజీ ఎమ్మెల్యే ఉప్పలేటి కల్పన, కృష్ణ జిల్లా ఎస్సీఎల్ ప్రెసిండెంట్ శ్రీవాసం మునెయ్య, మాజీ కార్పోరేటర్ దోమకొండ జ్యోతి ఉన్నారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.