ఈ మధ్య కాలంలో అన్నిటికీ ఆత్మహత్య చేసుకోవడం కామన్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఆత్మహత్య మహాపాపం అని పెద్దలంటారు. కానీ, నేటి సమాజంలో చిన్న చిన్న కారణాలతో ఎంతో మంది విలువైన తమ ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. అయితే ఒక మహిళా ఏకంగా హైకోర్టులోనే సూసైడ్ అటెంప్ట్ చేయడం కలకలం రేపుతోంది. చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న తన కేసులో తీర్పు రాకపోవడంతో నిరాశలో మునిగిపోయిన ఓ మహిళ తెలంగాణా హైకోర్టులో ఆత్మహత్యాయత్నం చేసింది.
హైకోర్ట్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుండి దూకే ప్రయత్నం చేసింది కవిత అనే మహిళ. చాలా రోజులుగా పెండింగులో ఉన్న కేసులో తీర్పు రాకపోవడంతో నిరాశ తో ఆత్మహత్య చేసుకోవాలని చూసిన కవితని అడ్డుకున్న హైకోర్టు సెక్యూరిటి సిబ్బంది సెక్యూరిటీ కార్యాలయంలో కూర్చుబెట్టి కవితను విచారిస్తున్నారు. గోదావరి ఖని చెందిన కవిత, ఏప్రిల్ 11 న మురళి అనే వ్యక్తి అత్యాచారం చేసాడని ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇవ్వడం లేదని ఆమె సూసైడ్ అటెంప్ట్ చేయడానికి చూసింది.