ఢిల్లీ హైకోర్టు న్యాయవాదికి చెందిన నివాసాలు, కార్యాలయాలలో ఏకకాలంలో ఐటి అధికారుల సోదాలు చేయడం సంచలనం రేపింది. ఢిల్లీ, హర్యానాలలోని మొత్తం సుమారు 38 ప్రాంతాలలో ఐ.టి సోదాలు జరుగుతున్నాయి. పెద్ద మొత్తంలో నగదు లభించినట్లు ఐ.టి విభాగం ప్రకటించింది. కొన్ని బ్రోకరేజ్ కేసుల్లో మధ్యవర్తిత్వం చేసి క్లయింట్ల నుంచి ఢిల్లీ హైకోర్ట్ న్యాయవాది రెండు కేసులలో మొత్తం 217 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు అది కూడా నగదు రూపంలో తీసుకున్నట్లు సాక్ష్యాధారాలు లభ్యం అయ్యాయని అంటున్నారు.
ఢిల్లీలోని ఖరీదైన ప్రాంతాలలో లెక్కలలో చూపని డబ్బుతో నివాసాలు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన ఆధారాలు ఐటీ అధికారులకి లభించాయి. గత రెండేళ్లుగా అనేక స్కూళ్లు, ట్రస్ట్ ల ఆధ్వర్యంలో నిర్వహించే పలు స్కూళ్లను, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ఇతర ఆస్తులను కొనుగోలు చేసినట్టు గుర్తించారు. రెండు మధ్యవర్తిత్వం కేసులలో వివాదాలను పరిష్కారం చేసినందుకు న్యాయవాది క్లయింట్ల నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నట్టు చెబుతున్నారు.