ఈ రూ.10 నోట్లు మీ వద్ద ఉంటే.. మీరు లక్షాధికారి కావొచ్చు.. ఎలానో తెలుసా..!?

-

పాత రూ.10 నోట్లతో డబ్బులు సంపాదించొచ్చు. ఎలా అనుకుంటున్నారా? మీ వద్ద పాత కాలం నాటి నోట్లు ఉంటే మీరు లక్షాధికారి అయినట్టే. పాత నోట్లును విక్రయించి డబ్బులు పొందొచ్చు. అయితే మీ వద్ద పాత కాలం నాటి నోట్లు మాత్రమే ఉండాలి. అప్పుడే మీ నోట్లకు డిమాండ్ ఉంటుంది. పాత కాలం నాటి వస్తువులను ఇష్టపడి కొనేవారు ఉంటారు. వారు మీ నోట్లను కూడా కొనుగోలు చేసుకుంటారు. కరోనా వైరస్ వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో డబ్బు సంపాదించడానికి ఇది ఒక మార్గం. ఇంట్లో కూర్చొనే రూ.25,000 వరకు డబ్బులు సంపాదించవచ్చు . దీని కోసం మీరు ఎటువంటి కష్టం పడనవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే విక్రయాలు జరుపుకోవచ్చు. కేవలం మీ వద్ద పాత రూ.10 నోట్లు ఉంటే సరిపోతుంది.

కొత్త నోట్లు ఎక్కడైనా లభిస్తాయి. ఎవరి వద్దనైనా సులభంగా ఉంటాయి. మార్కెట్‌లో ప్రస్తుతం చాలా రూ.10 నోట్లు ఉన్నాయి. అందువల్ల వీటి గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. అయితే పాత నోట్లకు మాత్రం మంచి డిమాండ్ ఉంది. ఇవి అందరి దగ్గర ఉండవు. మనం మాట్లాడుకునేది మాత్రం బ్రిటీష్ వారి కాలంలో ఉపయోగించిన నోట్ల గురించి. ఇది వరకు కాలంలో కూడా రూ.10 నోట్లు ఉండేవి కానీ ఈ విషయం అందరికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ నోటుపై ఆశోక స్తంభం చిహ్నం ఉంటుంది. అశోక స్తంభంతో వచ్చిన తొలి రూ.10 నోటు ఇదే. మరోవైపు మూడు సింహాల సింబల్ ఉండగా, ఈ రూ.10 నోటును 1943లో బ్రిటీష్ వారు తీసుకొచ్చారు.

ఈ నోట్లకు రూ.20 వేల నుండి రూ.25,000 వరకు ధర పలుకుతోంది ప్రస్తుత మార్కెట్లో. మీ వద్ద 4 నోట్లు ఉంటే రూ.లక్ష వస్తాయి. మీరు ఈ నోటును ఆన్‌లైన్‌లోనే విక్రయించొచ్చు. అనేక ఆన్‌‌లైన్ వెబ్‌సైట్లలో మీరు ఈ నోట్లను విక్రయానికి పెట్టొచ్చు. ఇండియా మార్ట్, షాప్‌క్లూస్ వంటి సంస్థల వెబ్‌సైట్లలో నోట్లను అమ్మకానికి పెట్టొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news