ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్ షిప్ ఉంటే చాలు.. భారీ డిస్కౌంట్స్ తో పాటు రివార్డ్ కాయిన్స్

-

ఈ-కామర్స్ దిగ్గజంగా నిలిచిన ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్ల కోసం ఫ్లిప్‌కార్ట్ ప్లస్ అనే కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ లాయల్టీ ప్రోగ్రాం ద్వారా తమ వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ యాప్ లేదా వెబ్‌సైట్ నుండి చేసే ప్రతి కొనుగోలుకు సూపర్ కాయిన్స్ రూపంలో రివార్డ్స్ పొందుతారు వినియోగదారులు. ఇదేకాక వినియోగదారుడు చేసే ప్రతి ఆర్డర్ వేగంగా మరియు ఉచితంగా డెలివరీ కూడా పొందుతారు. బిగ్ బిలియన్ డే వంటి ఫెస్టివల్ సేల్స్ ను ఫ్లిప్ కార్ట్ మెంబర్స్ కు ముందస్తుగా యాక్సెస్ చేసుకునే వీలు ఉంటుంది. వినియోగదారులు ఆర్డర్ ద్వారా సంపాదించుకునే కాయిన్స్ ను రివార్డ్ ల కోసం వారు వాడుకోవచ్చు లేదా ఇతరులకు ఎక్స్ చేంజ్ కూడా చేయవచ్చు. పూర్తి కస్టమర్ సపోర్ట్ ను కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ వినియోగదారులు ఖర్చుపెట్టిన ప్రతి రూ .100కి రెండు సూపర్ కాయిన్‌లు లభిస్తాయి. ఈ సూపర్ కాయిన్స్ ఉపయోగించి చేసే ప్రతి చెల్లింపులకు 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

ఫ్లిప్ కార్ట్ మెంబర్స్ కు బిగ్ బిలియన్ డే ఫెస్టివల్ సేల్స్ కు ముందస్తుగానే యాక్సెస్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఆర్డర్ ద్వారా వారు సంపాదించే కాయిన్స్ ను రివార్డ్ ల కోసం వాడుకోవచ్చు లేదా ఎవ్వరికైనా ఎక్స్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఈ సూపర్‌కాయిన్‌లు ఎలా సంపాదించాలంటే..ఫ్లిప్ కార్ట్ సైట్లో ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ చేసే ప్రతి రూ .100 చెల్లింపుకు 4 సూపర్‌కాయిన్‌లు లభిస్తాయి. అదే, నాన్–ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ అయితే వారు చేసే ప్రతి రూ .100 ఖర్చుకు 2 సూపర్‌కాయిన్‌లు లభిస్తాయి. అయితే, ప్రతి ఆర్డర్‌కు గరిష్టంగా 100 సూపర్‌కాయిన్‌లు సంపాదించే అవకాశం మాత్రమే ఉంటుంది. అదే నాన్ ప్లస్ మెంబర్స్ అయితే ప్రతి ఆర్డర్‌కు గరిష్టంగా 50 సూపర్‌కాయిన్‌లు మాత్రమే సంపాదించే అవకాశం ఉంటుంది.

అయితే ఫ్లిప్ కార్ట్ సైట్ లో కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువు డెలివరీ అయ్యాక రిటర్న్ పీరియడ్ పూర్తయిన తర్వాతనే ఈ సూపర్ కాయిన్స్ కస్టమర్ల ఖాతాకు జమ అవుతాయి. జమ అయిన సూపర్ కాయిన్స్ ను వారు ఏడాదిలోపు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news