ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంబిబిఎస్ ప్రవేశ పరీక్ష అయిన నీట్ పరీక్షలు నిర్వహించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫలితాల్లో అవకతవకలు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ గ్రేడ్ లో పాస్ అయ్యే విద్యార్థులు సైతం ప్రస్తుతం ఫెయిల్ అయినట్లుగా నీట్ పరీక్షల ఫలితాలు రావడంతో విద్యార్థులు అందరూ తీవ్ర అయోమయంలో పడిపోతున్నారు. ఇక కొంతమంది విద్యార్థులు నీట్ ఫలితాలపై ఏకంగా కోర్టు మెట్లు ఎక్కుతున్న విషయం కూడా తెలిసిందే.
నీట్ పరీక్ష ఫలితాల విషయంలో అధికారులు చేసిన తప్పిదానికి ఒక విద్యార్థి భవిష్యత్తు లేకుండా బలైపోయింది. నీట్ పరీక్ష ఫలితాల్లో కేవలం ఆరు మార్కులు మాత్రమే రావడంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన సూర్య వంశి అనే విద్యార్థికి నీట్ పరీక్ష ఫలితాల్లో కేవలం ఆరు మార్కులు మాత్రమే వచ్చాయి. ఇటీవల ఆత్మహత్య చేసుకున్నది సదరు విద్యార్థి పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చినందువల్ల తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే సదరు విద్యార్థి ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ తీసుకొచ్చి పరిశీలించగా ఐదు వందల తొంభై మార్కులు వచ్చాయని ఫస్ట్ గ్రేడ్ లో పాస్ అయింది అన్న విషయం తేలింది.