హైదరాబాద్ రైతు బజార్లలో 35 కే కిలో ఉల్లి విక్రయించనుంది తెలంగాణా ప్రభుత్వం. ఈరోజు నుండి రైతుబజార్లలో విక్రయిస్తున్నామని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఉల్లిధరల నియంత్రణ కోసం మార్కెటింగ్ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. జంట నగరాల్లోని 11 రైతుబజార్లలో ఈ ఉల్లి అందుబాటులో ఉండనుందని ఆయన అన్నారు.
ప్రతి వ్యక్తికి రెండు కిలోల చొప్పున విక్రయిస్తామని, ఏదైనా గుర్తింపుకార్డు చూపించి ఈ ఉల్లి కొంక్కోవచ్చని అన్నారు. భారీ వర్షాలకు దేశవ్యాప్తంగా ఉల్లిపంట దెబ్బతిన్నదని ఆయన అన్నారు. ఎలాంటి లాభం లేకుండా రవాణా ఖర్చులు, దెబ్బతిన్న సరుకును దృష్టిలో ఉంచుకుని ఈ ఉల్లి అమ్మకాలు చేపట్టామని ఆయన అన్నారు. ఇక బయట మార్కెట్ లో అయితే ఉల్లి సెంచరీ కొట్టేసింది. కొన్ని చోట్ల అయితే డిమాండ్ ని బట్టి ఇంకా రేట్ పెంచేసి కూడా అమ్ముతున్నారు.