ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో ఆదివారం తన కాన్వాయ్‌పై దాడి జరిగిందని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ ఆరోపించారు. ఈ సంఘటన నవంబర్ 3 బులాండ్ షహర్ ఉప ఎన్నికకు ముందు జరగడంతో రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. హిందీలో ఒక ట్వీట్ లో చంద్ర శేఖర్… ” బులంద్ షహర్ ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలబెట్టాలి అనే మా నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు భయాందోళనకు గురవుతున్నాయి. ము చేసిన ర్యాలీ వారికీ కంటి మీద కునుకు లేకుండా చేసాయి. అందుకే నా మీద కాల్పులు జరిపారు అని ఆయన ఆరోపించారు.
ఓడిపోతున్నాము అనే నిరాశాలోనే తమ మీద దాడి చేసి ప్రశాంత వాతావరణం దిగాజార్చాలి అని చూస్తున్నారు అని యాన ఆరోపించారు. రాబోయే ఉప ఎన్నిక కోసం అభ్యర్ధి కోసం ప్రచారం చేస్తున్న సమయంలో తన కాన్వాయ్ మీద కాల్పులు జరిగాయి అని ఆరోపించారు.