కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ అధ్యక్ష్యుడు బండి సంజయ్ దీక్ష భగ్నం చేశారు పోలీసులు. వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ అపోలో ఆస్పత్రికి పోలీసులు తరలించారు. బండి సంజయ్ దీక్ష భగ్నంకు నిరసనగా కరీంనగర్ – మంచిర్యాల ప్రధాన రహదారిపై భారీ ఎత్తున రాస్తారోకోకు దిగారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నిజానికి సిద్ధిపేటలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను నిన్న రాత్రి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
బీజేపీ దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావు ఇంటికి బయలు దేరిన ఆయనని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ అరెస్ట్ పై మండిపడ్డారు సంజయ్. పోలీసులు అక్రమంగా తనను అరెస్ట్ చేశారన్నారు. ఇక ఈ క్రమంలో గింతు పట్టి మరీ కార్ లో ఎక్కించడంతో ఆయన సీరియస్ అయ్యారు. దీంతో ఆయన దీక్షకు దిగారు. ఇక ఆసుపత్రికి ఆయనని తరలించగా ఆస్పత్రిలో బండి సంజయ్ కు నిమ్మరసం ఇచ్చి మాజీ ఎంపీలు వివేక్,,జితేందర్ రెడ్డిలు దీక్ష విరమింపచేశారు.