దారుణం : కోడి కూర వండ లేదని పెళ్ళాన్ని చంపేశాడు !

నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోడి కూర వండ లేదని భార్యను హత మార్చాడు భర్త. లింగాల మండలం క్యాoపు రాయవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దసరా పండగ రోజు భార్య సీతమ్మని కొట్టి చంపి ఇంటిలో పెట్టి తాళo వేసి వెళ్లి పోయాడు భర్త సన్నయ్య. దుర్వాసన రావడంతో పోలీస్ లకు సమాచారమిచ్చారు స్థానికులు. సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

murder
murder

లింగాల మండలం క్యాoపు రాయవరానికి చెందిన సన్నయ్య, సీతమ్మలు భార్య భర్తలు. సన్నయ్య మద్యానికి బానిసగా మారాడు. దసరా పండుగ నాడు మద్యం తాగి వచ్చిన ఆయన భార్యను చికెన్ వండాలని ఆదేశించాడు. చికెన్ తెచ్చి భార్యకు ఇచ్చాడు. అయినా ఇంటికి వచ్చేసరికి భార్య చికెన్ కూర వండలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భార్యతో సన్నయ్య గొడవకు దిగాడు. ఆమెను చావబాదాడు అప్పటికీ అతని కోపం చల్లారలేదు. దీంతో చికెన్ వండకుండా ఏం చేస్తున్నావంటూ భార్య గొంతు కోశాడు.