నందిగామలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజా రాజధాని అమరావతి ఉద్యమం చేస్తున్న రైతులపై అక్రమ కేసులు బనాయించి రైతులను జైలుకు తీసుకెళ్లారు అని ఆయన మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఏరియల్ సర్వే పేరుతో అమరావతి చుట్టూ తిరిగారు అని అన్నారు. రైతులను ఓదార్చడానికి వెళితే బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు అని విమర్శించారు.
అన్ని విధాలా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది అని ఆయన ఆరోపించారు. దిక్కుమాలిన ప్రభుత్వం పక్క రాష్ట్రానికి బస్సులు నడవలేని అసమర్థులు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడుపుతారు అని నిలదీశారు. పేదవాడి ఇళ్ల స్థలాల విషయంలో సిబిఐ ఎంక్వైరీ వేస్తే వైసీపీ 40 మంది ఎమ్మెల్యేలు జైలుకు వెళ్తారు అని అన్నారు. కొడాలి నాని గుర్తుపెట్టుకో ట్రాక్టర్ తో గుద్దితే ఎవరు భయపడే వారు లేరు అని ఆయన పేర్కొన్నారు.