కడప: జిల్లాలోని సంబేపల్లి, సుడుంపల్లి, వీరబల్లిలో పోలీసులు నిర్వహించిన కూంబింగ్‌లో చిత్తూరు, తమిళనాడుకు చెందిన 16 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ అయ్యారు. అరెస్టైన వారిలో నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారి వద్ద నుంచి 1.5 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాలు సీజ్ చేసినట్లు అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.