సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న జిందగి పిచాక్ సాంగ్..!

-

 

శ్రీహర్ష కొనుగంటి డైరక్షన్ లో జస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, దినేష్ తేజ్, అభినవ్ మేడిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమా హుశారు. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ కూడా ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ఓ సాంగ్ రిలీజ్ చేశారు. జిందగి పిచాక్ అంటూ సాఫ్ట్ వేర్ జాబ్ చేసే రాహుల్ కష్టాలను ఈ పాటలో చూపించారు. సాంగ్ లిరిక్స్ తో పాటుగా విజువల్స్ కూడా యూత్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి.

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ పాట హల్ చల్ చేస్తుంది. చిన్న సినిమాలకు బ్రహ్మాస్త్రంగా మారిన సోషల్ ఫ్లాట్ ఫాంను టాలెంటెడ్ పీపుల్స్ బాగా వాడుతున్నారు. హుశారు దర్శక నిర్మాతలు కూడా ఈ సినిమా అప్డేట్స్ తో సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. బెక్కం వేణు గోపాల్ నిర్మిస్తున్న నిర్మిస్తున్న ఈ సినిమాలోని జిందగి పిచాక్ సాంగ్ ఒక్కటి చాలు సినిమాపై యూత్ ఎగబడటానికి.. డిసెంబర్ 7న రాబోతున్న ఈ సినిమా నుండి వచ్చిన ఈ సాంగ్ యూత్ ను ఆకట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news