మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 22 సెప్టెంబర్ 2024న భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత సక్సెస్ ఫుల్ చలనచిత్ర నటుడిగా, డాన్సర్ గా మెగాస్టార్ చిరంజీవి కొణిదెలని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. 1978లో మెగాస్టార్ అరంగేట్రం చేసిన రోజు కూడా సెప్టెంబర్ 22. మెగాస్టార్ చిరంజీవి 46 సంవత్సరాల కాలంలో తన 156 సినిమాల్లో 537 పాటల్లో 24000 డ్యాన్స్ మూవ్స్ చేశారు.
అందుకు చిరంజీవికి గిన్నిస్ వరల్డ్ రికార్డు లభించింది. ఈ ప్రకటనను గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు ప్రతినిధితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా ప్రకటించారు. ఈ ఈవెంట్ కి హాజరైన క్రమంలో 25 రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. డ్యాన్స్ స్కిల్ అనేది నాక్ ఎక్స్ ట్రా అని వెల్లడించారు చిరంజీవి. దీంతో అభిమానులు చిరంజీవి అరుదైన రికార్డు సాధించాడని సంతోషపడుతున్నప్పటికీ.. మరోవైపు చికెన్ గున్యా అనే విషయం తెలిసి బాధ పడుతున్నారు.