ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. 400 ఛార్జింగ్ స్టేషన్ లు !

-

ఏ‌పి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు బూస్ట్ ఇచ్చేలా చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో 400 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీలోని జాతీయ రహదారుల్లో ప్రతి 25 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటుకు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే గ్రామ వార్డ్ సచివాలయాలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్న ఏపీ సర్కార్ రూ. 250 కోట్లతో ఈ టెస్టింగ్ ఫెసిలిటీని సిద్దం చేయడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.

నిజానికి దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యం నివారించడానికి కేంద్ర ప్రభుత్వం వాహనాలపై ఎన్నో ఆంక్షలు విధించింది. వాటిలో ముఖ్యంగా 2020 కల్లా బిఎస్-6 ఇంజిన్ కలిగిన వాహనాలు ఉండాలని, అలానే 2022 కల్లా ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలని సూచించింది. దీనికి తగ్గట్టుగానే ఏపీ సర్కార్ పావులు కదుపుతోంది. ఇటీవల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి తగ్గట్టు చర్యలు తీసుకొంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news