ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ తరఫున ఆడటానికి రోహిత్ శర్మ క్రీజ్ లోకి వచ్చినప్పుడు అసలు అతను ఆస్ట్రేలియా పర్యటనకు ఎందుకు ఎంపిక కాలేదు అనే వివాదం మంగళవారం కొత్త మలుపు తిరిగింది. గాయపడ్డాడు అనే కారణంతో రోహిత్ ను మూడు ఇండియా స్క్వాడ్ ల నుంచి తప్పించారు. అయితే తాను ఫిట్ గా ఉన్నా అని రోహిత్ టాస్ సమయంలో చెప్పడం గమనార్హం.
ఇటీవల రవి శాస్త్రి మాట్లాడుతూ తనకు అసలు విషయం తెలియదని అన్నాడు. దీనిపై భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ శాస్త్రి వ్యాఖ్యలపై ప్రశ్నలు సంధించారు. “రోహిత్ శర్మ పరిస్థితి గురించి రవిశాస్త్రికి తెలియదని నేను అనుకోను” అని స్పష్టం చేసాడు. “అతను సెలక్షన్ కమిటీలో భాగం కాకపోయినా, సెలెక్టర్లు రవి శాస్త్రి ఆలోచన ఎలా ఉందో ఒక రోజు లేదా రెండు రోజుల క్రితం అతనితో మాట్లాడి ఉండాలి. అతని అభిప్రాయాన్ని మరియు ఇన్ పుట్ లను తీసుకోవాలన్నాడు.