భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది..భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ- సీ 49 వాహక నౌక దూసుకెళ్లింది..ఈ ఏడాది ఇస్రో పంపించిన తొలిప్రయోగం ఇది.. పీఎస్‌ఎల్‌వీ- సీ 49 రాకెట్ బరువు 290 టన్నులు.. పీఎస్‌ఎల్‌వీ- సీ 49 వాహకనౌక మొత్తం 10 ఉపగ్రహాలను మోసుకెళ్లింది..అందులో భారత్‌కు చెందిన ఈవోఎస్-1 సహా 9 విదేశీ ఉపగ్రహాలను నింగిలలోకి పంపించింది ఇస్రో..షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ సీ- 49 రాకెట్‌ను ప్రయోగించాలని ప్రయోగించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అయితే అనివార్య కారణంగా కౌంట్‌డౌన్‌ను 10 నిమిషాలు పొడిగించారు.
ఈవోఎస్-1 ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనా భూమిని నిశితంగా పరీక్షించవచ్చు..సరిహద్దుల వెంట నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తతలను తెలుసుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది..అలాగే నిఘాతో పాటు వ్యవసాయం, అటవీ, నేల తేమ, భూగర్భశాస్త్రం, తీర పర్యవేక్షణ, వరదలను పరిశీలించేందుకు ఈ ఉపగ్రహం ద్వారా పర్యవేక్షించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.