వివాదాస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద ఒక పుస్తకం విడుదల కాబోతోంది. ఆ పుస్తకం పేరు వర్మ మన ఖర్మ. అయితే ఆసక్తికర అంశం ఏంటంటే ఈ పుస్తకాన్ని ఆయనే ఆవిష్కరించి పోతున్నాడు. రేఖ పర్వతాల అనే యువతి రాసిన పుస్తకాన్ని ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నటి మంచు లక్ష్మితో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. వర్మని డిఫైన్ చేయాలంటే ఎవరికి సాధ్యం?
ప్రపంచంలోని ఏ వస్తువునైనా, మరే మనిషినయినా డిఫైన్ చెయ్యగలం కానీ ఈ వర్మని డిఫైన్ చెయ్యమని అడిగితే మాత్రం సరిగ్గా ఈ మనిషి ఇది అని డిఫైన్ చెయ్యలేమని రచయిత్రి చెబుతోంది. ఎందుకంటే.. అతడ్ని జ్ఞాని అన్నా, పిచ్చోడన్నా, తెలివైనవాడు అన్నా ఏది అన్నా అది అప్పటికే నని ‘అతను ఇదే’ అని చెప్పడం మాత్రం చాలా కష్టమైన పని అంటోంది ఆమె. అంటే మాటలకూ, డెఫినిషన్స్ కు అందని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ అని ఆయన్ని కొంతలో కొంత డిఫైన్ చెయ్యడానికి ఈ పుస్తకం రాసానని ఆమె అంటోంది.