గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం కోసం కష్టపడుతున్న తెలంగాణా రాష్ట్ర ప్రబ్భుత్వం ఇప్పుడు హైదరాబాద్ వాసులను అభివృద్ధి మంత్రంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చడానికి మరిన్ని లింక్ రోడ్లు అందుబాటులోకి తీసుకొస్తారు. నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో 42 కోట్ల రూపాయలతో చేపట్టిన కనెక్టివిటీ రోడ్లను పురపాలక శాఖా మంత్రి మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.
ఓల్డ్ ముంబై రోడ్డు లెదర్ పార్క్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 వరకు, ఖజా గూడ చెరువు నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వరకు మరో రోడ్డు, హైదర్ నగర్ మిత్రా హిల్స్ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ వరకు మరో రోడ్డుని కెటిఆర్ ప్రారంభిస్తారు. ఈ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనితో రద్దీ కొంత మేర తగ్గే అవకాశం ఉండవచ్చు.