వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక వివాదం వస్తూనే ఉంటుంది. తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ మాత్రం ఆసక్తికరంగా మారింది. వైసిపి రెబల్ ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజుతో ఆయన ఒక ఫోటో తీసి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా దానిని షేర్ చేశారు. అంతే కాదు షేర్ చేయడంతో పాటు ఆర్ ఆర్ ఆర్ అంటే రఘురామకృష్ణంరాజు ప్లస్ ఆర్ అంటే రాంగోపాల్ వర్మ కలిస్తే బస్తీమే సవాల్ అర్థం వచ్చేలా ఒక ట్వీట్ పెట్టారు. అలాగే ఈ ఫోటోలో వీళ్ళిద్దరూ ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్టు వేలు చూపించడం కూడా చర్చనీయాంశంగా మారింది.
నిజానికి గత కొద్ది రోజులుగా ఈ వైసిపి రెబల్ ఎంపీ వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అలాంటి ఆయన ఇప్పుడు వర్మతో కలిసి ఫోటో దిగడంతో వైసీపీ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఇప్పటికీ వర్మ రాజకీయంగా టిడిపి మీద సినిమాల పరంగా పవన్ ఫ్యామిలీ మీద డైరెక్టుగానే సినిమాలు తీసి రిలీజ్ చేశాడు. ఇప్పుడు తమ పార్టీకి జగన్ కి తలనొప్పిగా మారిన ఈయనతో చేరి మళ్ళీ తమ జగన్ మీద ఏమైనా సినిమాలు తీస్తాడా ఏంటి అనే టెన్షన్ లో వాళ్లు మునిగిపోయినట్లు చెబుతున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?
RRR + R = BASTHI ME SAWAAL💪💪💪 pic.twitter.com/jrjloO8K2b
— Ram Gopal Varma (@RGVzoomin) November 10, 2020