ఐపీఎల్-2020 ఫైనల్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ప్రారంభంలో వరుస వికెట్లు కోల్పోయిన ఢిల్లీని పంత్,శ్రేయాస్ అయ్యార్ ఆదుకున్నారు. ఇద్దరు చెరో హాఫ్ సెంచరీతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. పంత్(56), శ్రేయాస్ అయ్యర్(64) చేయాగా చివరి వరుస బ్యాట్స్ మెన్ చేతులెత్తేయడంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ 156 పరుగులు మాత్రమే చేయగలిగింది.
157 పరుగుల లక్ష్యం కొంత తక్కువే అయినప్పటికీ ఢిల్లీ బౌలర్లు రాణిస్తే ముంబై కష్టమనే చెప్పాలి. మరి ముంబై ఈ టార్గెట్‌ను ఛేదిస్తుందా.. లేక ఢిల్లీ తడబడుతుందా.. అనేది వేచి చూడాలి. అయితే ఐపీఎల్ చరిత్రలో నాలుగు సార్లు టైటిల్ గెలిచిన ముంబై.. ఇప్పటి వరకు చేజింగ్‌లో టైటిల్ గెలవలేదు. ముంబై చాంపియన్‌గా నిలిచిన 2013, 2015, 2017, 2019 సీజన్లలో తొలుతే బ్యాటింగ్ చేసింది. అలాగే చాంపియన్స్ లీగ్ టైటిల్ గెలిచిన 2011, 2013లో కూడా చేజింగ్‌లో విజయం సాధించలేదు.