మాహిష్మతి సామ్రాజ్యంలో ఎదురైన పరాభవానికి జవాబివ్వడానికి భారీస్కెచ్చులేస్తున్నాడు. అప్పుడు మిస్ అయినా ఇప్పుడు మిస్ అయ్యేది లేదంటూ ఛైర్‌ని దక్కించుకోవడానికి బాలీవుడ్ పరిచయాలు వాడేస్తున్నాడు రానా. ఇంతకీ వీళ్ల మధ్య ఫైటింగ్‌కి కారణమేంటి
రానా ఓ వైపు హీరోగా నటిస్తూనే సపోర్టింగ్ రోల్స్ కూడా ప్లే చేస్తున్నాడు. ‘బాహుబలి’లో విలనిజం చూపించాడు. ‘హౌస్‌ఫుల్-4’కి సపోర్టింగ్‌గా నిలిచాడు. మరోవైపు ‘అరణ్య’ సినిమాతో అడవిబిడ్డగా మారిపోయాడు. పీరియాడికల్ డ్రామా ‘1945’లోకి వెళ్లిపోయి సైనికుడిలా గన్నుపట్టాడు. ఇక ‘విరాటపర్వం’లో మానవహక్కుల గురించి మాట్లాడబోతున్నాడు. వీటికితోడు మైథలాజికల్ మూవీ ‘హిరణ్యకశిప’ కూడా ఉంది. వైవిధ్యమైన సినిమాలతో జర్నీ చేస్తోన్న భళ్లాలదేవుడు నెక్ట్స్ ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటించబోతున్నాడు.
‘బాహుబలి’ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ప్రభాస్‌తో పోటీపడుతోన్న రానా పాన్ ఇండియన్ మూవీస్‌కి సైన్ చేస్తోన్నాడు. మల్టీలింగ్వల్‌గా రూపొందిన ‘అరణ్య’,మిలింద్ రావ్ డైరెక్షన్‌లో మల్టీలింగ్వల్‌గా ‘ధీరుడు’ ఇక పాన్ ఇండియన్ ఫిల్మ్‌గా ‘హిరణ్యకశిప’ ఇలా వరుసగా ప్రెస్టిజియస్ ప్రాజెక్టులతో ప్రభాస్ కి సవాల్ విసురుతున్నాడు.