మరో వివాదంలో ఎమ్మెల్యే శ్రీదేవి.. రెడ్డ్లు చాలా డేంజర్ అట !

-

గుంటూరు జిల్లా తాడికొండ రాజకీయం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే శ్రీదేవి మీద ఆరోపణలు చేస్తూ 2 ఆడియో టేప్లు రిలీజ్ చేసిన సందీప్ తాజాగా మరో ఆడియో విడుదల చేశాడు. దీంతో ఇరువురి మధ్య వివాదం తారా స్థాయికి చేరిందని చెప్పచ్చు. ఈ ఆడియోలో స్థానిక నేతలతో ఉన్న విభేదాలను శ్రీదేవి ప్రస్తావించారు. అలాగే రెడ్డి సామాజిక వర్గం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది ఎమ్మెల్యే శ్రీ దేవి. ఎప్పటికీ ఎస్సీలు బీసీలు ఒకటిగా ఉండాలని, రెడ్డి సామాజిక వర్గం చాలా డేంజర్ అంటూ ఆడియోలో ఆమె చెప్పుకొచ్చింది.

అలానే అగ్ర కులాల వాళ్లు మనల్ని వాడుకోంటున్నారంటూ ఈ ఆడియోలో ఉంది. ఆడియోలో రెడ్డి సామాజిక వర్గాన్ని తూర్పారబట్టిన ఎమ్మెల్యే శ్రీదేవి ఎస్సీలు, బిసిలు ఒకటిగా ఉండాలి రెడ్లు అనేవాళ్లు చాలా డేంజర్ అని శ్రీదేవి చెబుతోంది. బహిరంగంగా ఎస్సీల మీద ప్రేమ చూపుతారు తప్ప వారికీ నిజంగా అయితే ప్రేమ లేదు అని చెబుతున్నట్టు ఉంది. అయితే సీఎం జగన్ సహా వైసీపీ అంతా ఆ సామాజికవర్గానికి చెందిన నేతలే ఉండడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారిందని చెప్పచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news