బీహార్ లో మహాకూటమికి నాయకత్వం వహించిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పై బిజెపి సీనియర్ నేత ఉమా భారతి ప్రసంశల వర్షం కురిపించారు. బుధవారం ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు. తేజశ్వి యాదవ్ చాలా మంచి కుర్రాడు అంటూ ఆమె ప్రసంశలు కురిపించారు. కాని అతనికి రాష్ట్రాన్ని నడిపించే అంత శక్తి లేదని చివరికి బీహార్ ని లాలూ నడిపించే వారు అని పేర్కొన్నారు.
మళ్ళీ బీహార్ లో ఆటవిక రాజ్యం వస్తుంది అని అన్నారు. ఇక మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల గురించి మాట్లాడుతూ… కమల్ నాథ్ జి ఈ ఎన్నికలలో చాలా బాగా పోరాడారు అన్నారు. బహుశా అతను తన ప్రభుత్వాన్ని బాగా నడిపిస్తే సమస్యలు ఉండేవి కావు అన్నారు. అతను నా అన్నయ్య లాంటి వ్యక్తి అన్నారు. ఈ ఎన్నికలలో చాలా వ్యూహాత్మకంగా పోరాటం చేసారు అని ఆమె అన్నారు.