నాకు కూడా ఆ రోజు వస్తుంది : రాశి కన్నా

-

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తన చిలిపి నవ్వుతోనే ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించి. మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుని దూసుకుపోతుంది రాశి ఖన్నా. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూకి హాజరైన రాశి కన్నా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల పెళ్లి చేసుకున్న పలు సెలబ్రిటీల పెళ్లి విషయాన్ని కూడా ప్రస్తావించింది ఈ ముద్దుగుమ్మ.

రానా పెళ్లి ఫోటో చూసి ఆశ్చర్య పోయాను అంటూ తెలిపింది రాశిఖన్నా. అంతే కాకుండా కాజల్ నితిన్ లు కూడా తమ సోల్ మేట్ ని పెళ్లి చేసుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే తన జీవితంలో కూడా ఆ అందమైన రోజు వస్తుందని దాని కోసమే ఎదురు చూస్తున్నా అంటూ రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ అమ్మడు.

Read more RELATED
Recommended to you

Latest news