మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి సిఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఖరారు చేసారు అని రాజకీయ వార్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. సిఎం కేసీఆర్ కేబినేట్ సమావేశంలో దీనిపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది అని ప్రభుత్వ వర్గాలు కూడా అంటున్నాయి. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత తుమ్మల సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. అక్కడి నుంచి ఆయనకు ఏ పదవి లేదు.
ఇప్పుడు గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయి. దీనితో ఒక ఎమ్మెల్సీ పదవికి తుమ్మల పేరు ఖరారు చేసారు. ఒకరు ఓసీ, ఒకరు ఎస్టీ, మరొకరు బీసీకి ఎమ్మెల్సీ ఇవ్వనుండగా ఓసీ కోటాలో తుమ్మలకు ఖరారు చేసారు. నేడు జరగబోయే కేబినేట్ సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.