పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్ లో ఇప్పుడు అలజడి రేగింది. బిజెపి అక్కడ బలపడాలి అని భావిస్తుంది కాబట్టి అధికార పార్టీని దెబ్బ కొట్టే ఆలోచనలో ఉంది. ఈ నేపధ్యంలోనే బిజెపి ఎంపి అర్జున్ సింగ్ బాంబు పేల్చారు. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన సౌగతా రాయ్ మరో నలుగురు ఎంపిలతో పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అర్జున్ సింగ్ శనివారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని జగద్దల్ ఘాట్‌లోని ఛత్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఐదుగురు టిఎంసి ఎంపిలు ఎప్పుడైనా రాజీనామా చేసి బిజెపిలో చేరతారని నేను పదేపదే చెబుతున్నాను అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. ఇక కొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశం ఉంది అనే ప్రచారం జరిగింది. దీనితో సిఎం మమత అప్రమత్తమయ్యారు.