బుద్ధి మార్చుకొని పాక్.. మరోసారి..!

ఇటీవలే పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం తో భారత్ పాకిస్తాన్ వనికి పోయే విధంగా దారుణంగా భారత్ ఎదురు దాడి చేసిన విషయం తెలిసిందే. మిసైల్స్ కూడా ప్రయోగించడం సంచలనంగా మారిపోయింది. పాక్ సైనికులు అందరు ని తరిమితరిమి కొడుతూ పాక్ సరిహద్దుల్లో కి ఐదు కిలోమీటర్ల దూసుకెళ్ళి ఎడతెరిపి లేకుండా కాల్పులు జరిపింది భారత సైన్యం. అంతే కాకుండా ఎన్నో లాంచ్ ప్యాడ్లు కూడా స్వాధీనం చేసుకుంది. అయినప్పటికీ పాక్ బుద్ది మార్చుకో లేదు.

మరోసారి సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. శనివారం తెల్లవారుజామున ఒకటి గంటల సమయంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ సైనికులు భారత సైన్యంపై కాల్పులు జరిపారు. జమ్మూకాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో నౌషేరా సెక్టార్ వెంబడి కాల్పులకు తెగబడింది పాక్ సైన్యం. ఇక ఈ దాడిలో హవల్దార్ పాటిల్ సంగ్రామ్ శివాజీ అనే జవాన్ అమరుడయ్యాడు. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం పాకిస్తాన్ సైన్యానికీ సరైన బుద్ధి చెప్పింది.