ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కనిపించడం లేదట. అవును.. ఏపీ ప్రజలే మా సీఎం కనిపించడం లేదంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. బబ్బాబు.. మా సీఎం కనిపిస్తే కాస్త మా రాష్ట్రానికి పంపించండి. మా రాష్ట్రంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మా రాష్ట్రం అభివృద్ధిని గాలికి వదిలేసి పక్క రాష్ట్రంలో కొత్త రాజకీయాలు మొదలు పెట్టిండు. ఉన్న ఇంటిని సక్కదిద్దుకునే తెలివి లేదు కానీ.. పక్కింటికెళ్లి ప్రగల్భాలు పలికాడంట వెనుకటికి చంద్రబాబు లాంటోడు. మేం ఓట్లేసి బాబును గెలిపించాం. కానీ.. ఏపీలో మాత్రం పాలనను గాలికి వదిలేశాడు. అసలు.. మేం ఎలా ఉన్నామో కూడా పట్టించుకోనంతగా వేరే రాష్ట్రం పోయి అక్కడే తిష్ట వేశాడు. మీకు కాస్త కనిపిస్తే మా రాష్ట్రానికి పంపించరు.. అంటూ ఆంధ్రా ప్రజలు అడుగుతున్నట్టుగా వాట్సప్ మెసేజ్ ఒకటి వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఆ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. ఆ వార్తను చదివిన నెటిజన్లు.. అవును.. నిజమే చంద్రబాబు ఎక్కడున్నాడో మాకు కనిపిస్తే మేం ఏపీకి పంపిస్తాం అటూ సెటైర్లు వేస్తున్నారు. వాట్సప్ లో వైరల్ అవుతున్న వార్త ఇదే…
అయ్యా… కొంచెం మా ముఖ్యమంత్రి ఎక్కడైనా కనపడితే చెప్పండి
ఇక్కడ పాలన గాలికొదిలేసి తెలంగాణలో రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడు. తనతోపాటు ఇక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా తనతో తిప్పుకుంటూ ఆంధ్రాలో ప్రజలను, పాలనను గాలికొదిలేశారు. మొన్నటిదాకా రాహుల్ గాంధీ, మమతాబెనర్జీ అంటూ నెలలపాటూ తన పార్టీని కాపాడుకోవడం కోసం దేశమంతటా తిరిగాడు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నాడంటగా కాస్త ఎక్కడైనా కనపడితే చెప్పి ఆంధ్రాకు పంపించండి బాబూ మీకు పుణ్యముంటుంది.
రాష్ట్రాన్ని కాపాడతానని ప్రమాణస్వీకారం చేసి, కాపాడకపోగా దోచుకుతింటూ తనని గెలిపించిన ప్రజలనే తనని కాపాడమని, రక్షణగా ఉండమని కోరిన చేతగాని ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి అని చులకనగా తీసిపాడేయ్యొద్దు. మాకు సిగ్గులేదు- మేము గెలిపించుకున నాయకులకు సిగ్గులేదు. ఇంకో నాలుగునెలల పాలన మిగిలిఉంది. ఈ నాలుగునెలలైనా వెళ్ళి మీ రాష్ట్రంలో పనిచేసి నువ్వు తీసుకుంటున్న జీతానికి, పదవికి న్యాయం చెయ్యవయ్యా అని కాస్త బుద్ది చెప్పి పంపించండి బాబూ…!
బాబ్బాబూ… మీ తోటి సోదరులుగా అడుగుతున్నాం కాస్త ఈసాయం చేసి పెట్టండి బాబూ…!
ఇట్లు
ఆంధ్రా ప్రజలు