ఆవు సంక్షేమానికి నిధులు సమకూర్చడానికి ప్రజలపై సెస్ విధించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్ణయం తీసుకోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గృహ, రాబడి, పశుసంవర్ధక, వ్యవసాయం, పంచాయతీలు మరియు అడవులు వంటి వాటిని కలుపుతూ ఆవు కేబినేట్ ని ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. ఈ తరుణంలో ఆవుల సంక్షేమం కోసం కొత్త పన్ను విధించాలని నిర్ణయించారు.
ఆవు అనేది చాలా మందికి పవిత్ర జంతువు అని ఆయన అన్నారు. ప్రత్యేక పన్నులతో జంతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం కోసం తాము నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. ఆవు సంక్షేమంపై కూడా, స్వచ్ఛంద సంస్థలను సహకారం అందించాలి అని ప్రోత్సహించమని ఆయన సూచనలు చేసారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అక్కడ ప్రజలకు ఉపాధి లేకుండా ఈ చర్యలు ఎందుకు అని పలువురు ప్రశ్నిస్తున్నారు.