మన దేశంలో ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం అత్యవసర వినియోగ అనుమతి కోరుతూ పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) కు ఆదివారం దరఖాస్తు చేసింది. ప్రజల ఆసక్తి మరియు అత్యవసర వినియోగం కోసం ఈ దరఖాస్తు చేసింది అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. యుకె, బహ్రెయిన్ లో దీనికి ఆమోదం లభించింది.
ఆక్స్ఫర్డ్ కోవిడ్ -19 వ్యాక్సిన్, కోవిషీల్డ్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ఇండియాలో సీరం ద్వారా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐసిఎంఆర్ ప్రకారం, సీరం ఇప్పటికే డిసిజిఐ నుండి అనుమతి పొంది అట్-రిస్క్ తయారీ మరియు స్టాక్ పైలింగ్ లైసెన్స్ క్రింద 40 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్ ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ ని ముందు ఫ్రంట్ లైన్ వారియర్స్ కి అందిస్తారు.