వ్యవసాయ చట్టాలపై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వ్యాఖ్య

-

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్తంగా రైతులు నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రైతులంతా కలిసి నిరసన కొనసాగిస్తున్నారు. ఈ నిరసనకి దేశ వ్యాప్తంగా రైతులకి మద్దతు లభిస్తుంది. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల్లోని ప్రముఖ వ్యక్తులు ఈ నిరసనపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. బాలీవుడ్ సెలెబ్రిటీల్లో చాలా మంది వ్యవసాయ చట్టాల నిరసనపై తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

Priyanka Chopra arrives at Variety’s Power of Women Luncheon at the Beverly Wilshire hotel on Friday, Oct. 13, 2017, in Beverly Hills, Calif. (Photo by Jordan Strauss/Invision/AP)

తాజాగా ప్రియాంకా చోప్రా వ్యవసాయ చట్టాలపై సాగిస్తున్న నిరసన గురించి మాట్లాడుతూ, రైతులు ఫుడ్ సోల్జర్స్ అని చెప్పింది. ప్రజాస్వామ్య దేశంలో వారి భయాలను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి ఆశలు నెరవేర్చాలి. దీనికి చాలా తొందరగా పరిష్కారం వస్తే బాగుంటుందని ట్విట్టర్ ద్వారా తెలిపింది. అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వ్యవసాయ చట్టాలపై రైతులు చేపడుతున్న నిరసనకి మద్దరు తెలిపాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన భారత్ బంద్ నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news