దేవుడికి కొట్టే కొబ్బరికాయ కుళ్లిపోతే.. ఏం జరుగుతుందో తెలుసా..?

-

చాలా మంది దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టే అలవాటు ఉంటుంది. ఇక గుడికి వెళ్ళినా, ఏదైనా మంచి పని మొదలు పెట్టాలన్నా, పూజలలో కొబ్బరి కాయ కొట్టాల్సిందే. ఇంతకీ కొబ్బరి కాయనే ఎందుకు కొడతారు. అయితే.. పురాణాల ప్రకారం కొబ్బరి కాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. కొబ్బరి కాయ దేవుడు ముందు కొట్టడం వల్ల మనిషిలో ఉన్న అహంకారం పటాపంచలు అవుతుంది అని నమ్ముతారు.

cocount
cocount

ఇక దేవుడి పూజలో చేసే ప్రతి పని వెనుక ఎదో ఒక కారణం ఉంటుంది. ఏవి చేసినాకూడా మనస్సు దేవుడికి అంకితం అవ్వడం కోసమే చేస్తాము..మనస్సు దేవుడి పాదాల మీద పెట్టి భక్తి మార్గం లో పయనింపచేయడమేపూజలో చేసే ప్రతి పని వెనుక ఉన్న అర్ధంఅని చెప్తారు. మనకి భక్తి ఉంటే ఏది జరిగిన భగవంతుడి దయ అని అనుకోగలగాలి. అప్పుడు మాత్రమే చిన్న చిన్న విషయాలకు కూడా కృంగిపోకుండా ఉంటాము.

దేవుడికి పూజ చేసి కొబ్బరికాయ కొడతాం..ఆ కొబ్బరికాయ కుళ్ళి పోతే మంచిది కాదని, పువ్వు వస్తే మంచిదని అనుకుంటారు . అయితే, ఈ విషయం లో పండితులు చెప్పేది ఏంటంటే దీనికి పురాణా ల్లోనూ, శాస్త్ర గ్రంథాల్లోనూ ఆధారాలు ఎక్కడ లేవని ,ఇవన్నీ ప్రాంతీయమైన, వ్యక్తి గతమైన విషయాలని అంటున్నారు . దాని ప్రయోజనం అంతవరకే గాని కుళ్ళిన కొబ్బరికాయ మనిషి జీవితాన్ని ఎప్పుడు నిర్ణయించదు అని గుర్తుపెట్టుకోవాలి.

ఒకవేళ కొబ్బరి కాయ కుళ్ళి పొతే అది పారేసి చేతులు శుభ్రం చేసుకుని ఇంకొక కొబ్బరికాయ కొట్టవచ్చు.. లేదా ఇంక కొబ్బరి కాయలు లేనట్టయితే మనస్ఫూర్తిగా ప్రార్థన చేసిన చాలు.. అంత మాత్రాన ఎలాంటి నష్టము జరగదు. అంతేకానీ, కుళ్ళిపోయిన కొబ్బరికాయ మంచిది కాదు, పువ్వు వచ్చిన కొబ్బరికాయ మంచిది అని అనేది అపోహేతప్ప మరొకటి కాదని పండితులు తెలియ చేస్తున్నారు .

ఇక కొబ్బరికాయ లోపల ఎలా ఉంటుందో మనం తెలుసుకోలేము కాబట్టి ఆ విషయాన్ని అంతగా పట్టించుకోనవసరం లేదు. పూజ చేసేటప్పుడు మనసుని దేవుడిపై లగ్నం చేస్తే చాలు.. కాబట్టి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే బాధపడడమో.. బయపడడమో చేయవలిసిన పనిలేదని తెలియచేస్తున్నారు .

Read more RELATED
Recommended to you

Latest news