యూట్యూబ్ రివైండ్ 2018 పేరుతో వచ్చిన వీడియో నెగెటివ్ టాక్‌ను మూటకట్టుకున్నది. ప్రతి సంవత్సరం చివరలో ఆ సంవత్సరానికి సంబంధించిన ట్రెండింగ్ అంశాలతో యూట్యూబ్ రివైండ్ పేరుతో యూట్యూబ్ వీడియోను రిలీజ్ చేస్తుంటుంది. ఈసారి కూడా రిలీజ్ చేసింది కానీ.. అది బెడిసి కొట్టింది. ఎంతలా అంటే.. ఆ వీడియో అప్‌లోడ్ అయిన 10 రోజుల్లోనే 11 మిలియన్ల డిస్ లైక్స్ వచ్చాయి. అంటే కోటీ పదిలక్షల డిస్ లైక్స్ అన్నమాట.
2011 నుంచి రివైండ్ వీడియోను యూట్యూబ్ రిలీజ్ చేస్తోంది. జస్టిన్ బీబర్ మ్యూజిక్ వీడియో బేబీకి వచ్చిన డిస్‌లైక్స్‌ను ఇది అధిగమించింది. జస్టిన్ బీబర్ వీడియోకు 10 మిలియన్ల డిస్‌లైక్స్ వచ్చాయి. దీంతో ఇప్పటివరకు ఆ వీడియోనే ఎక్కువగా డిస్‌లైక్స్ వచ్చిన వీడియోగా చరిత్రకెక్కింది. కానీ.. యూట్యూబ్ రివైండ్ వీడియో 2018 కు వచ్చిన 11 మిలియన్ల డిస్ లైక్స్‌తో యూట్యూబే ఓ చెత్త రికార్డును తిరగరాసుకుంది.
ఇక.. ఈ వీడియో బెడిసికొట్టడంతో ఆ వీడియోలో నటించిన నటులు అసలు ఈ వీడియో ఎందుకు నెటిజన్లకు నచ్చలేదో చెప్పేందుకు ప్రత్యేకంగా వీడియోలు రూపొందించి వాటిని కూడా యూట్యూబ్‌లో వదిలారు.