భైరవగీత రివ్యూ & రేటింగ్

-

డైరక్టర్ గానే కాదు నిర్మాతగా కూడా వర్మ స్టైల్ వేరు. తన నిర్మాణంలో సిద్ధార్థ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా భైరవగీత. ధనుంజయ్, ఇర్రా మోర్ జంటగా నటించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

తాతల కాలం నుండి సుబ్బారెడ్డి (బాల రాజ్ వాడీ) దగ్గర ఊడిగం చేస్తుంటారు భైరవ (ధనుంజయ్). ఫ్యాక్షన్ లీడర్ అయిన సుబ్బారెడ్డి తన స్థాయికి తగినవాడిని చూసి తన కూతురు గీత (ఇర్రా మోర్) పెళ్లి చేయాలని అనుకుంటాడు. కట్టా రెడ్డి (విజయ్ రాం) గీతని పెళ్లాడేందుకు సిద్ధమవుతాడు. ఇదిలాఉంటే భైరవ గీత ఇద్దరు ప్రేమించుకుని వారి ప్రేమను గెలిపించుకునేందుకు ఊరు వదిలి వెళ్తారు. తన దగ్గర పనిచేసే పనోడు తన కూతురిని లేపుకెళ్లడంతో భైరవ కుటుంబాన్ని, స్నేహితులను ఘోరంగా చంపించేస్తాడు సుబ్బారెడ్డి. విషయం తెలుసుకున్న భైరవ సుబ్బారెడ్డు మీద ఎలా కక్ష్య తీర్చుకున్నాడు అన్నది సినిమా కథ.

ఎలా ఉంది :

ఆర్జివి వాయిస్ ఓవర్ తో మొదలవడంతో సినిమా కథ ముందే తెలుస్తుంది. దర్శకుడు సిద్ధార్థ్ డైరక్షన్ టాలెంట్ బాగున్నా రొటీన్ కథ అయ్యే సరికి పెద్దగా చూపించే అవకాశం లేకుండాపోయింది. 90ల్లో జరిగే కథగా కథనం సాగించిన తీరు బాగున్నా కథ, వయిలెన్స్ మాత్రం సినిమా మీగ నెగటివ్ ఇంప్రెషన్ కలిగిస్తాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్ రొమాన్స్ అలరించిన అందుకు తగిన రీజన్ మాత్రం ఉండదు.

సినిమాలో వెయిలెన్స్ శాతం బాగా ఎక్కువైందని చెప్పాలి. వర్మ నిర్మాత అయినా అతని టేకింగ్ యాజిటీజ్ దించేశాడని చెప్పొచ్చు. కథ కొద్దిగా కొత్తగా ట్రై చేసి ఉంటే మాత్రం దర్శకుడు సక్సెస్ అయ్యేవాడు. సినిమా కాస్త కూస్తో బి,సి సెంటర్స్ లో పర్వాలేదు అనిపించుకోవచ్చు కాని ఏ సెంటర్స్, మల్టీప్లెక్స్ వారికి మాత్రం చిరాకు తెప్పిస్తుంది. ఇక యూత్ ఆడియెన్స్ మెచ్చే రొమాన్స్ ఉన్నా అది ఒక్కపాటలోనే కాబట్టి వారికి ఎక్కదని చెప్పొచ్చు.

ఎలా చేశారు :

ధనుంజయ్ నటన బాగుంది. అయితే అక్కడక్కడ లౌడ్ గా అనిపిస్తుంది. కాస్ట్ అండ్ క్రూ ఎంచుకోవడంలో వర్మ స్టైల్ వేరేలా ఉంటుంది. హీరోయిన్ ఇర్రా మోర్ అందంతో ఆకట్టుకుంది. అభినయం కూడా పర్వాలేదు. సుబ్బారెడ్డి, కట్టా రెడ్డి పాత్రలు చేసిన వారు కూడా బాగానే చేశారు. మిగతా పాత్రలన్ని పర్ఫార్మెన్స్ ఓకే.

సినిమా కెమెరా మెన్ గా పనిచేసిన జగదీష్ తన బెస్ట్ ఇచ్చాడు. రవి శంకర్ మ్యూజిక్ బాగుంది. బిజిఎం అలరించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. స్టోరీ పాతదే అయినా దర్శకుడు కథనం కూడా అదే తరహాలో సాగించాడు.

ప్లస్ పాయింట్స్ :

సినిమాటోగ్రఫీ

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

రొటీ స్టోరీ

వెయిలెన్స్ ఎక్కువవడం

బాటం లైన్ : భైరవగీత.. నిర్మాతగా కూడా వర్మ ఫెయిల్..!

రేటింగ్ : 1.75/5

Read more RELATED
Recommended to you

Latest news