కరోనా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడా అని ప్రపంచమంతా కళ్లు కాయలు కాసేలా ఎదురు చేస్తుంది. ఈ క్రమంలో అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లకు అనుమతి ఇస్తున్నట్లు ఇటీవల డీసీఐజీ ప్రకటించింది. వ్యాక్సిన్లకు అనుమతి ఇస్తున్నట్లు భారత్ తీసుకున్న నిర్ణయాన్ని డబ్ల్యూహెచ్‌ఓ స్వాగతించింది. కరోనా కట్టడికి భారతదేశం దేస్తున్న పోరాటం అద్భుతమని డబ్లూహెచ్‌ఓ రీజినల్ డైరెక్టర్ డా. పూనల్ కేత్రపాల్ సింగ్ పేర్కొన్నారు.
కరోనా వ్యాక్సిన్‌కు అనుమతి ఇస్తున్నట్లు ఆదివారం డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వీజ్ సోమాని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆక్స్‌ఫర్డ్ అస్ట్రాజెనెకా తయారు చేసిన వ్యాక్సిన్ దాదాపుగా 75 శానికి పైగా సమర్థవంతంగా ఉందంన్నారు. విదేశాలల్లో జరిపిన∙ప్రయోగ ఫలితాలతో సమానంగా ఈ వ్యాక్సిన్ కూడా సమర్థత ఉందని ఆయన వివరించారు. అయితే.. ప్రథమ, ద్వితియ దశల్లో 800 మంది వాలంటీర్లపై జరిపిన ప్రయోగాల గురించి ఆ సంస్థ నిపుణుల బృందంకు వివరించినట్లు పేర్కొన్నారు. కొవాగ్జిన్ మూడో దశ ప్రయోగాలను 25,800 మంది వాలంటీర్లపై జరపనున్న నేపథ్యంలో ఇప్పటికి 22, 500 మంది తీసుకోగా వారిలో ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపాలేదని డీసీఐజీ ఉన్నతాధికారి తెలిపారు.