టాయిలెట్లలో ‘డబుల్ ఫ్లష్’లని ఎలా ఉపయోగించాలంటే…?

-

ప్రస్తుతం అందరి ఇళ్లల్లో వెస్టర్న్ టాయిలెట్లు, ప్లషులు సాధారణం అయిపోయాయి. మీరు చూసే ఉంటారు టాయిలెట్ల లోని కొన్ని ఫ్లష్‌లకు రెండు బటన్లు ఉంటాయి. కానీ చాలా మందికి రెండు ఎలా ఉపయోగపడతాయో తెలీదు. ఈ రెండు బటన్లు లో ఒకటి చిన్నదిగా, మరొకటి పెద్దదిగా ఉంటుంది. అదేంటి రెండు ఒకేలా డిజైన్ చెయ్యలేదేంటి అని అనుకోకండి. రెండిటి వల్ల కూడా వేరు వేరు ప్రయోజనాలు ఉన్నాయి. మరి అదేమిటి..? ఇప్పుడే దీని కోసం పూర్తిగా తెలుసుకోండి.

మోడ్రన్ టాయిలెట్లలో ‘డబుల్ ఫ్లష్’లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ సాధారణ టాయిలెట్ల లో లివర్ ఫ్లష్ లేదా బటన్ ఫ్లష్‌లు ఉంటున్నాయి. అయితే తాజాగా వస్తున్న టాయిలెట్లలో డబుల్ ఫ్లష్‌లు ఉంటున్నాయి. అలానే లివర్ టైప్‌లో హాప్ ఫ్లష్, ఫుల్ ఫ్లష్‌లు ఉంటాయి. ఇవన్నీ ఎగ్జిట్ వాల్వ్‌కు కనెక్ట్ చేసి ఉంటాయి. ఇది ఇలా ఉంటె చిన్న లివర్, పెద్ద లివర్ మధ్య తేడా ఏంటి అంటే..? చిన్న లివర్ (బటన్) నొక్కితే 3 నుంచి 4.5 లీటర్ల నీళ్లు విడుదలవుతాయి.

దీనిని మలవిసర్జన తర్వాత పెద్ద బటన్ నొక్కాలి. మూత్ర విసర్జన తర్వాత చిన్న లివర్ నొక్కితే ఎక్కువగా నీరు రాకుండా తక్కువ నీరే వస్తుంది. నీరు వేస్ట్ కాదు. డ్యుయల్ ఫ్లషింగ్ ఉపయోగించడం ద్వారా ఏడాదిలో 20 వేల లీటర్ల నీటిని ఆదా చేసుకోవచ్చు. అసలు ఈ పనితీరు ఆలోచన ఎలా వచ్చిందంటే..? అమెరికా పారిశ్రామిక డిజైనర్ విక్టర్ పాపనెక్ 1976లో రాసిన ‘డిజైన్ ఫర్ ది రియల్ వరల్డ్’ అనే పుస్తకం ద్వారా దీనిని రూపొందించడం జరిగింది. నీటిని పొదుపు చేసేందుకు 1980లో ఆస్ట్రేలియాలో దీన్ని తొలిసారి అమల్లోకి తెచ్చారు. ఇలా ఇప్పుడు అన్ని చోట్లకి ఇది వచ్చింది. దీని వల్ల నీళ్లు ఆదా చేసుకోవచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news