ఆ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా ? 50 లీటర్ల పెట్రోల్ ఫ్రీ !

-

ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే ఈ రేట్లు సెంచరీని దాటాయి. ఇక ఈ రేట్లు పెంపుదల గురించి సోషల్ మీడియాలో ఇప్పటికే రకరకాల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్డిఎఫ్సి బ్యాంకు తన ఖాతాదారులకు పెట్రోల్ డీజిల్ ఫ్రీ గా పొందే అవకాశం కల్పిస్తోంది హెచ్డీఎఫ్సీ బ్యాంక్. ఇండియన్ ఆయిల్ బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించాక హెచ్డిఎఫ్సి కార్డుతో బిల్లు కడితే ఫ్యూయల్ పాయింట్ లు ఇస్తారు. ఒక సీఫ్యూయల్ పాయింట్ 96 పైసలు తో సమానం.

ఈ ఫ్యూయల్ పాయింట్స్ తో ఏడాదికి 50 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ ఫ్రీగా పొందవచ్చని చెబుతున్నారు. మొదటి ఆరు నెలల్లో 250 ఫ్యూయల్ పాయింట్లు తర్వాత నెలకు 150 ఫ్యూయల్ పాయింట్లు వస్తాయి. ఇవేగాక నిత్యావసరాలు లేదా ఇతర బిల్ పేమెంట్స్ చేసినప్పుడు కూడా నెలకు దాదాపు 100 ఫ్యూయల్ పాయింట్స్ వస్తాయని చెబుతున్నారు. అంతే కాక 150 రూపాయలు ఖర్చు చేస్తే ఒక ఫ్యూయల్ పాయింట్ ఇచ్చేలా హెచ్డీఎఫ్సీ ఏర్పాట్లు చేసింది. ఈ ఫ్యూయల్ పాయింట్స్ వ్యాలిడిటీ దాదాపు రెండేళ్లు ఉంటుంది. అంటే ఏడాదికి ఐదు వేల ఫ్యూయల్ పాయింట్స్ యూజ్ చేస్తే 50 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ ఫ్రీగా పొందొచ్చు అన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news