తెలంగాణాలో లాయర్ దంపతుల హత్య తర్వాత కొన్ని ఆందోళనకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఒక భూ వివాదం వెలుగులోకి వచ్చింది. భూ వివాదంలో అడ్వకేట్ చిక్కుకున్నారు. భూ యజమానుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నది. ఈ ఘటన నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ -7 లో నివాసం ఉండే హైకోర్టు న్యాయవాది జశ్వంత్ చౌదరి కొంతకాలంగా ఓ భూవివాదం కేసుని డీల్ చేస్తున్నారు.
ఈ మధ్య ఆ కేసుని ఓడిపోయారు. అయితే మా దగ్గర డబ్బు తీసుకుని… అవతలి వాళ్ళు ఇచ్చిన సోముకి ఆశపడి అమ్ముడుపోతావా అంటూ భూ యజమానులు మండిపడ్డారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 16న సాయంత్రం 6 గంటల సమయంలో హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ -7 లో అడ్వకేట్ తో భూ యజమానులు గొడవకు దిగారు.
కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నాలు చేయగా… ఒక వ్యక్తి అడ్వకేట్ తలపై రివాల్వర్ గురిపెట్టి చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. అయితే అక్కడ ఉన్న స్థానికులు అందరూ కూడా అక్కడికి రావడంతో భూ యజమానులు వెనక్కు తగ్గారు. ఇన్ స్పెక్టర్ పాలేపల్లి రమేష్ కుమార్ ఎస్సై చంద్రశేఖడ్డిల దృష్టికి లాయర్ తీసుకువెళ్ళారు. ఈ కేసుని విచారించే అంశంలో ఇప్పుడు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.