బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు : ప్రధాని మోదీ

-

పశ్చిమ బెంగాల్: బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఉత్సాహం, శక్తిని చూస్తుంటే భవిష్యత్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోందని ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పును స్వాగతించడం.. ఈ మార్పు కోల్‌కతా నుంచి ఢిల్లీకి తాకుతోందని అభిప్రాయపడ్డారు. బెంగాల్‌లో దోపిడీ ప్రభుత్వం రాజ్యమేలుతోందని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సంస్కృతి సంప్రదాయాలను అవమానిస్తున్నారని మండిపడ్డారు.

modi
modi

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో బీజేపీ ప్రభుత్వం హుగ్లీ జిల్లాలో భాజపా ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, నిధులను రాష్ట్ర ప్రజలకు అందకుండా పశ్చిమ బెంగాల్ అధికార ప్రభుత్వం అడ్డుకుంటోందని మోదీ విమర్శించారు. రైతులు, పేదలకు లబ్ధి చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోనే నిధులు విడుదల చేస్తుంటే.. కొందరు తృణమూల్ కాంగ్రెస్ నేతలు సిండికేట్‌గా మారి డబ్బులు సామాన్యులను చేరకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో అవినీతి, దోపిడీ రాజ్యమేలుతోందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు ధనికులుగా, సామాన్యులు పేదలుగా మారిపోతున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చాలా కుటుంబాలకు తాగునీటి సౌకర్యం లేదని.. మమతా ప్రభుత్వం రక్షిత తాగునీటికి పథకం ఉన్నా సద్వినియోగం చేసుకోవడం లేదని విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందరో మహనీయులను నిర్లక్ష్యం చేసిందని, దేశభక్తి లేదన్నారు. హుగ్లీ ప్రాంతంలో గ్యాస్, రైల్వే ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నామని ప్రధానీ మోదీ వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు బీజేపీ ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి పాలనకు అడ్డుకట్ట వేసి.. దేశాభివృద్ధికి పాటు పడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news