ప్రైవేట్ కాలేజీలపై తెలంగాణా హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు, అసలు ఏం మాట్లాడుతున్నారు…?

-

జూనియర్ కాలేజీల అగ్నిమాపక నిబంధనలపై హైకోర్టులో విచారణ జరిగింది. నిబంధనలు పాటించని కాలేజీలు మూసివేశామని ఇంటర్ బోర్డు హైకోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళింది. 20 నారాయణ, 10 శ్రీచైతన్య సహా 40 కాలేజీలు మూసివేసాం అని ఇంటర్ బోర్డు వివరించింది. కాలేజీలపై చర్యలపై 3 వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. అగ్నిమాపక శాఖ నిబంధనలపై శ్రీచైతన్య, నారాయణ, గాయత్రి కాలేజీల పిటిషన్లపై కూడా విచారణ జరిగింది.

చట్టం రాకముందు నిర్మించిన భవనాలకు కూడా అనుమతివ్వడం లేదన్న కాలేజీల యాజమాన్యాలు… ప్రభుత్వం అకస్మాత్తుగా నిబంధనలు అమలు చేయాలని చెబుతోందని ఆరోపించాయి. ప్రత్యామ్నాయ నిబంధనలు పరిశీలించాలని కోరాయి. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఇప్పుడే నిద్ర లేచిందని ధర్మాసనంవ్యాఖ్యానించింది. కాలేజీలు అగ్నిమాపక నిబంధనలు పాటించాలసిందేనని స్పష్టం చేసింది. విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టవద్దని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. నిబంధనలకు అనుగుణంగా లేని భవనాల్లో కాలేజీలు ఎలా కొనసాగిస్తారన్న హైకోర్టు… కొన్ని కాలేజీలు కేవలం లాభాల కోసం నడుపుతున్నాయని వ్యాఖ్యలు చేసింది. కాలేజీల వాదన ఏ మాత్రం సహేతుకంగా లేదన్నది.

Read more RELATED
Recommended to you

Latest news