జియో ఫోన్ 2021 ఆఫ‌ర్‌.. ఒక్క‌సారి రీచార్జి చేస్తే ఏడాది వ‌ర‌కు వాడుకోవ‌చ్చు..!

-

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో త‌న జియో ఫోన్ వినియోగ‌దారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. 2జి-ముక్త్ భార‌త్ కింద ఈ ఆఫ‌ర్‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది. ఇందులో భాగంగా జియో ఫోన్ క‌స్ట‌మ‌ర్లు 3 విధాలుగా ఆఫ‌ర్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే..?

reliance jio gives jio phone 2021 offer

కొత్త క‌స్ట‌మ‌ర్లు అయితే…

ఆఫ‌ర్ – 1

* జియో ఫోన్‌, 24 నెల‌ల రీచార్జి క‌లిపి రూ.1999 అవుతుంది.
* అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌, నెల‌కు 2 జీబీ డేటా ఇస్తారు.
* 2 ఏళ్ల వ‌ర‌కు రీచార్జి చేయాల్సిన ప‌ని లేదు.

ఆఫ‌ర్ – 2

* జియో ఫోన్‌, 12 నెల‌ల రీచార్జి క‌లిపి రూ.1499 చెల్లించాలి.
* అన్ లిమిటెడ్ కాల్స్, నెల‌కు 2జీబీ డేటాను అందిస్తారు.
* ఏడాది వ‌ర‌కు రీచార్జి చేయాల్సిన ప‌నిలేదు.

ఇప్ప‌టికే ఉన్న జియో ఫోన్ క‌స్ట‌మ‌ర్లు అయితే…

* 12 నెల‌లకు రూ.749తో రీచార్జి చేసుకోవాలి.
* అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, నెల‌కు 2జీబీ డేటా ఇస్తారు.
* ఏడాది వ‌ర‌కు రీచార్జి చేసుకోవాల్సిన ప‌నిలేదు.

కాగా ఈ ఆఫ‌ర్ మార్చి 1వ తేదీ నుంచి అందుబాటులోకి వ‌చ్చింద‌ని రిల‌య‌న్స్ జియో ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news