జపాన్ మంత్రివర్గంలో కొత్త శాఖ.. ‘లోన్లీనెస్ మినిస్టర్’..!

-

జపాన్ ప్రధాని యోషిహిదే సుగా తన మంత్రివర్గంలో తొలిసారి ఓ కొత్త శాఖని ప్రవేశపెట్టారు. లోన్లీనెస్ మినిస్టర్ అనే శాఖను ప్రారంభించారు. లోన్లీనెస్ మినిస్టర్ అంటే ఒంటరితనం నివారణకు సంబంధించిన మంత్రిత్వ శాఖ. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి సృష్టించిన విలయ తాండవం అంతా ఇంతా కాదు. కోవిడ్‌తో కారణంగా ఎంతో మంది ప్రాణాలు పోయాయి. దీని వల్ల ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. జపాన్‌లో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఎన్నడూ లేనంతగా పెరిగింది. కోవిడ్ సమస్యతోపాటు ఆత్మహత్యల సంఖ్య కూడా పెరిగింది. దీంతో జపాన్ ప్రభుత్వం లోన్లీనెస్ మినిస్ట్రీని తీసుకొస్తోంది.

జపాన్‌ ప్రధాన మంత్రి యోషిహిదే సుగా

2018లో యూకేలో తొలిసారిగా లోన్లీనెస్ మినిస్ట్రీ లాంటి ఒక శాఖను ప్రవేశపెట్టారు. యూకేను ఆదర్శంగా తీసుకొని జపాన్ ప్రధాని యోషిహిదే సుగా ఈ శాఖను ప్రవేశపెట్టారు. ఈ శాఖ ద్వారా జనన మరణాల రేటును ఎదుర్కోవడం, ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసే అంశాలపై శ్రద్ధ చూపనున్నారు. మంత్రి టెట్సుషి సకామోటో మంత్రి బాధ్యతలోపాటు లోన్లీనెస్ మినిస్టీ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, నిరాశ్రయులు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని మంత్రి సకామోటో తెలిపారు. ప్రజల మధ్య సంబంధాలు బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. నిరాశ్రయులైన వారి సమస్యను పరిష్కరించేందుకు ఫిబ్రవరి 19వ తేదీన ఐసోలేషన్, లోన్లీనెస్ కౌంటర్ మెంబర్స్ ఆఫీస్‌ను ప్రారంభిస్తున్నామన్నారు.

కాగా, జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ వివరాల ప్రకారం.. జపాన్‌లో ఇప్పటివరకు 4,26,000 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 7,577 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్‌తోపాటు ఆత్మహత్యకు పాల్పడిన మహిళల సంఖ్య కూడా ఎక్కువైంది. గతేడాది ఏకంగా 6,976 మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. 2019 సంవత్సరంతో పోల్చితే 15 శాతం ఆత్మహత్య కేసులు పెరిగాయని, 11 ఏళ్లలో ఆత్మహత్యల సంఖ్య పెరగడం ఇదే తొలిసారి అన్నారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఆత్మహత్య చేసుకున్నారు. అందుకే జపాన్ ప్రభుత్వం వీరికి ఆసరాగా ఉండేందుకు లోన్లీనెస్ మినిస్ట్రీ శాఖను ప్రారంభించింది.

Read more RELATED
Recommended to you

Latest news